ముగ్గురిని మింగిన సాగు బావి
వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడటంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది.
- పూడికతీత తీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిన క్రేన్
- మృతుల్లో పదో తరగతి విద్యార్థి
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొర్కిశాలలో విషాదం
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడటంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొర్కిశాలకు చెందిన సుకినె దేవరావు, మోహన్నావు అన్నదమ్ములు. తమ వ్యవసాయ బావిలో నీరు రాకపోవడంతో ఇటీవల క్రేన్‌తో పూడికతీత పనులు చేపట్టారు. శనివారం బకెట్లో పెద్ద బండతో పాటు మట్టిని నింపారు. ఈ క్రమంలో బకెట్లో బరువు ఎక్కువై క్రేన్ బావిలో పడిపోయింది. దీంతో బావిలో ఉన్న భూ యజమాని సుకిమె దేవరావు (48), కూలీ సరిగొమ్ముల పైడయ్య (53)తో పాటు పదోతరగతి విద్యార్థి బండారి అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందారు. బావి యజమాని సోదరుడు మోహన్‌రావుకు సైతం తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
ప్రాణం తీసిన సరదా..
కొర్కిశాల గ్రామానికి చెందిన బండారి అభిలాష్ (16) పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి చేరుకుని పక్కనే క్రేన్‌తో బావి పూడికతీత పనులు జరుగుతుండగా చూసేందుకు వెళ్లాడు. సరదాగా క్రేన్‌పై కూర్చుని పూడికతీతను చూస్తున్నాడు. క్రేన్ హఠాత్తుగా బావిలో పడిపోవడంతో అభిలాష్ సైతం బావిలో పడి మృత్యువు ఒడిలో చేరాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చిట్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చిట్యాల సీఐ మల్లేశ్, మొగుళ్లపల్లి, గణపురం ఎస్సైలు సురేశ్, అశోక్ పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

