గొర్ల కొమురయ్య, రైతు, ఆరెపల్లి, హుస్నాబాద్ ( సిద్దిపేట జిలా) : నాకున్న రెండున్నరెకరాల భూమిలో రెండెకరాల్లో వరి వేసిన. పంట చేతికొచ్చే సమయంలో బాయి, బోరు రెండు ఒకేసారి అడుగంటాయి. నీళ్లు తగ్గుతూ వస్తున్నకొద్దీ రోజుకింత వరి ఎండిపోయింది. రెండెకరాల్లో ఒక ఎకరం వరకు పూర్తిగా ఎండిపోవడం వల్ల పశువులను మేపుతున్నా. మా భూములకు దగ్గరలో ఉన్న కుంట మత్తడి తెగిపోయి అందులో నీళ్లు లేకుండాపోయాయి.
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కుంటలో నీళ్లు లేకపోవడంతో మా బాయిలు, బోర్లలో నీళ్లు అడుగంటినయి. మిగిలిన ఎకరం కూడా ఎండిపోయేటట్టు ఉన్నది. గొలుసులు వేసి కోతకు వచ్చే ముందు పంట ఎండిపోవడం బాధనిపిస్తంది. పెట్టుబడులు రాక అప్పులు పెరిగే పరిస్థితి ఉన్నది. సర్కారోళ్లు ఏమైనా సాయం చేస్తే బయటపడుతం.