హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో ఓ ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలకం సృష్టించాయి. ఆ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడటంతోనే అక్కడ మత్తులో మునిగి ఉన్న కొందరు కాల్పులకు దిగినట్టు తెలిసింది.
అయితే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఒక రివాల్వర్‌ను, బుల్లెట్లను, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. అరెస్టయిన వారిలో ఏపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, కొందరు రాజకీయ నాయకులు, మరికొందరు వీఐపీలు ఉన్నట్టు తెలిసింది.