అసెంబ్లీ నడిచిన తీరు బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. హౌస్ కమిటీ వేయమంటే ఎందుకు భయమని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనింగ్‌పై మాట్లాడితే మైక్ ఇవ్వమని అంటున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడితే సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడియం శ్రీహరి ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి అడిగారని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మైనింగ్ ఇష్యూను డైవర్షన్ చేసేలా సభను నడిపారని అన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలు వేయలేదని తెలిపారు. ప్రతిపక్షం గొంతు నొక్కాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు.