Sunitha Laxma Reddy | మెదక్ : మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే మనస్తత్వం ఆమె సొంతం. కష్టాల్లో అండగా నిలిచి, నేనున్నాను అని మానసిక స్థైర్యం కల్పించే అంత గొప్ప మనస్సు ఆమెది.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సునీతా లక్ష్మారెడ్డి బయల్దేరారు. అయితే నర్సాపూర్ అడవి ప్రాంతంలో కారు – టిప్పర్ ఢీకొన్నాయి. ప్రమాదాన్ని గమనించిన సునీతా లక్ష్మారెడ్డి తన కారు ఆపారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న క్షతగాత్రులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వారికి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు.
ప్రమాదాల్లో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆపన్న హస్తం అందివ్వాలని ఆమె చాటి చెప్పారు. వేగంగా వాహనాలు నడిపే వాళ్లు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.