హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల ఆధ్వర్యంలోని బడుల్ల్లో జూన్ 5 నుంచి 13వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
జూన్ 5న ‘వరల్డ్ ఇన్విరాన్మెంట్ డే’ సందర్భంగా ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’ అనే అంశంపై పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు తెలిపారు.