ఒకే చెట్టుకు స్నేహితుల ఉరి

- లాల్‌సాబ్‌గూడ అటవీప్రాంతంలో ఘటన
కుత్బుల్లాపూర్, జనవరి 12: ఇద్దరు స్నేహితులు ఒకే చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిన 48 గంటల వ్యవధిలోనే విగతజీవులై కనిపించారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాల్సాబ్ గూడ అటవీప్రాంతంలో చోటుచేసుకున్నది. గాజులరామారం గ్రామానికి చెందిన బండోజీ సాయికుమార్ (22), నరేశ్ (22) స్నేహితులు. ఈ నెల 10న ఇండ్ల నుంచి బయటకు వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో సాయికుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరి మిస్సింగ్ కేసు నమోదైంది. 11న తల్లికి ఫోన్‌చేసిన నరేశ్.. తాము వికారాబాద్‌లో ఉన్నామని, తమ కోసం ఎందుకు వెతుకుతున్నారని అడిగి ఫోన్‌స్విచ్చాఫ్ చేశాడు. మంగళవారం రాత్రి లాల్‌సాబ్‌గూడ అటవీప్రాంతంలో సాయికుమార్, నరేశ్ చీరలతో ఒకే చెట్టుకు ఉరి వేసుకొని కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు, నరేశ్, సాయికుమార్ కలిసి ఇటీవల మరో స్నేహితుడి ప్రేమ పెండ్లిని ఆర్యసమాజ్‌లో జరిపించినట్టు సమాచారం. పెండ్లి తర్వాత సమస్యలు వస్తాయనే భయంతో వికారాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి.. మంగళవారం ఉరేసుకుని కనిపించారు. భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
తాజావార్తలు
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
- కోవిషీల్డ్ టీకానే వేయించుకుంటాం: ఢిల్లీ వైద్యులు
- నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
- ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
- శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'