Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా విద్యా శాఖ మంత్రి ఎవరు? మా విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ నిరసనలు తెలిపారు.
పేదల ఇండ్లు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ.. మా స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రశ్నించారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని హన్మకొండ కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించారు.
మాకు విద్యాశాఖ మంత్రిని కేటాయించండి అంటూ హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించిన పేద దళిత విద్యార్థులు
మా స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ నిదులు వెంటనే విడుదల చేయండి.. పేద వాళ్ళ ఇండ్లు కూలాగొట్టే శ్రద్ధ మా మీద లేదా
అంటూ విద్యార్థుల ఆందోళన https://t.co/yEcKghlOrX pic.twitter.com/0M60QqiBU7— Telugu Scribe (@TeluguScribe) September 30, 2024