హైదరాబాద్ : ఉడకని అన్నం, నీళ్లలాంటి సాంబారు, చాలీ చాలని అన్నం వడ్డింపు.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)సొంత నియోజకవర్గంలో(Kodangal )మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారుతో అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గుడ్డు, అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థులు తల్లితండ్రులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను మార్చాలని ఎంఈఓ శంకర్ నాయక్‌ను డిమాండ్ చేశారు.
ఈ తిండి మేము తినలేం సార్.. సీఎం సొంత నియోజకవర్గంలో రోడ్డెక్కిన విద్యార్థులు
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఉడకని అన్నం నీళ్ళలాంటి సాంబార్
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబార్ పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే… pic.twitter.com/7KGu1dXbY8
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025