HCU students : కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు.
యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. దాంతో రేవంత్ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.