హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఆందోళనలు జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
తాజాగా తమ గ్రామాలకు సకలంలో బస్సులు(Buses) రావడం లేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్( Shadnagar) పట్టణంలోని చౌరస్తా వద్ద కాలేజీ విద్యార్థులు ధర్నాకు(Students protest) దిగారు. ఆర్టీసీ ఎండీకి తమ సమస్య గురించి ఎన్నో సార్లు చెప్పామని.. ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను బలవంతంగా అక్కడ నుంచి తరలించే ప్రయత్నంచ చేశారు.
బస్సులు సమయానికి రావడం లేదని రోడ్డెక్కిన విద్యార్థులు
తమ గ్రామాలకు సకలంలో బస్సులు రావడం లేదని షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తా వద్ద కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు.
ఆర్టీసీ ఎండీకి తమ సమస్య గురించి ఎన్నో సార్లు చెప్పామని.. ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కరించాలని, లేదంటే… pic.twitter.com/aVMYPjeNsy
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2024