నారాయణపేట : నాలుగు ముక్కలు నేర్చుకునేందుకు ఆ విద్యార్థులు(Students) నానా అవస్థలు పడు తున్నారు. క్లాసులు వినాలంటే కాలువ దాటాల్సిందే. మోకాలు లోతు నీళ్లతో సర్కస్ ఫీట్లు చేస్తూ క్లాసులకు వెళ్లాల్సిన దుస్థితి ఆ తండా విద్యార్థులది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలకు వెళ్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా(Narayanapet Dist) మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామపంచాయతీ పరిధిలోని బద్రి నాయక్ తండా నుంచి రోజు 20 మంది విద్యార్థులు పెద్ద చింతకుంటలోని ప్రభుత్వ పాఠశాలకు వస్తారు.
గత వారం పది రోజుల నుంచి వస్తున్న వర్షాలకు కాలువలో పెద్ద మొత్తంలో నీరు ప్రవహిస్తునడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలువ దాటి చదువుకోవడానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద చింతకుంట నుంచి బద్రి నాయక్ తండాకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో పాటు కాలువలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో విద్యార్థులు నిత్యం కష్టాలు అనుభవిస్తున్నారు. వాగు ఉధృతంగా ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి పెద్ద చింతకుంట నుంచి పద్య నాయక్ తండా వరకు రహదారి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.