తెలంగాణ పోరాటం తరహాలో ఉద్యమిస్తాం.. ఫీజులపై పోరుకు సిద్ధం : అఖిలపక్ష విద్యార్థి సంఘాలు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో అఖిలపక్ష యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు నల్ల కండువాలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చుతున్నదని జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆరోపించారు. బకాయిలను విడుదల చేయని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో పలు వర్సిటీల నేతలు ఉమేశ్, వంశీ, సంజయ్, పాపారావు, మహేందర్, అజయ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు విద్యార్థుల తడాఖా చూపిస్తాం.. బీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్
రీయింబర్స్మెంట్ పథకాన్ని సర్కార్ నిర్వీ ర్యం చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్వీ అధ్యక్షు డు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సర్కార్‌కు విద్యార్థుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యే ల జీతాలు, అలవెన్స్‌లకు డబ్బులుంటాయి.. కానీ విద్యార్థుల చదువులకు ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులుండవా? అని ప్రశ్నించారు. విద్యా భరోసాకార్డు ఊసేలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యమానికి శ్రీకారంచుడుతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

