రఘునాథపాలెం, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఖమ్మం యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ కళాశాలల్లో తరగతులను నిలిపివేస్తుండటంతో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 17న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నాడు.
కాగా, ఈ పాదయాత్ర పోస్టర్‌ను మాజీమాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఆదివారం హెచ్‌సీయూలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.