Mancherial | భీమారం, నవంబర్ 28 : ఇంగ్లిష్ మీడియం చదవడం ఇ ష్టం లేక ఓ విద్యార్ధిని ఆత్మహ త్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్పల్లిలో జరిగింది. కు టుంబ సభ్యులు, స్థానికుల కథ నం ప్రకారం.. పోతన్పల్లికి చెంది నలాటుకూరి బానేశ్-కవితకు ఇద్దరు సంతానం కాగా, అనుశ్రీ (16) పెద్ద కూ తురు. రామకృష్ణాపూర్లోని కస్తుర్బాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. పది వరకు తెలుగు మీడియం చదివింది. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం కావడంతో ఇబ్బంది పడుతూ వ చ్చింది.
తెలుగుమీడియంలో చేర్పించాలని తండ్రికి పలుమార్లు చెప్పింది. రెండో సంవత్సరంలో తెలుగు మీడియం లో చేర్పిస్తానని తండ్రి చెప్పాడు. మంగళవారం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు మంచిర్యాల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందు తూ బుధవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.