హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంగళవారం క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా ముందుకొచ్చిన నలుగురు మంత్రు లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును చూసిన వా రంతా ‘అయ్యో పాపం.. మంత్రులు’ అంటూ సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. వీరితో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు ముఖం చాటేసి.. మంత్రులను ముందుకు తోశారనే విమర్శలు వినిపించాయి. సీఎం రిక్వెస్ట్‌తో తప్పని పరిస్థితుల్లో మంత్రులు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది.
సాధారణంగా ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా అక్కడ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించేందుకు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటితో పాటు సంబంధిత నిర్ణయాలున్న శాఖల మంత్రులు వస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు వచ్చి వివరాలు వెల్లడిస్తారు. కానీ మంగళవారం జరిగిన క్యాబినెట్ అనంతరం ఏకంగా ఆరుగురు మంత్రులు అందులో కీలకమైన నలుగురు మంత్రులు రావడం చర్చనీయాంశమైంది. కొద్దిసేపటి తర్వాత గానీ ఆ నలుగురు ఎందుకొచ్చారనేది అర్థంకాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి పర్సనల్ రిక్వెస్ట్‌తో వారంతా మీడియా ముం దుకొచ్చినట్టు తెలిసింది. క్యాబినెట్ భేటీలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక భూముల కన్వర్షన్ పాలసీపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ పాలసీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తీవ్రమైన విమర్శలు, రూ.5 లక్షల కుం భకోణం, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నదంటూ చేసిన ఆరోపణలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
‘బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తున్నయి. నేనొక్కడినే తప్పు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. నన్ను, నా కుటుంబ సభ్యులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మీరు ఖండించరా? ఇది సమష్టి నిర్ణయమని చెప్పలేరా?’ అంటూ మంత్రులపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘ఈ ఆరోపణలను మీరే ఖండించాలి.మీడియా ముందుకెళ్లి వివరించాలి’ అని కోరినట్టు తెలిసింది. పైగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందనే ప్రచారం ఉన్నది.
క్యాబినెట్ అనంతరం పాలసీ వివరాలు వెల్లడించే సమయంలోనూ శ్రీధర్‌బాబు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో సీఎం ప్రత్యేకంగా శ్రీధర్‌బాబును రిక్వె స్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితు ల్లో ఆ నలుగురు కీలక మంత్రులు మీడియా ముందుకొచ్చినట్టు సమాచారం. సీఎంను కా పాడేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించడం అక్కడ కనిపించింది. ‘ఈ పాలసీ పూర్తిగా సమ ష్టి నిర్ణయం.. మా నలుగురి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నం’ అని వెల్లడించారు.