హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాపై ట్రిబ్యునల్లో బలమైన వాదనలను వినిపించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి రాష్ట్ర న్యాయవాద బృందానికి సూచించారు.
ట్రిబ్యునల్ విచారణకు హాజరవుతున్న న్యాయవాదుల బృందం, నీటిపారుదల శాఖ అధికారులతో ఆదివారం ఆయన జలసౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు కొనసాగిన విచారణ అంశాలను అడిగి తెలుసుకున్నారు.