గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 01:46:57

ప్రవాహంలా మద్దతు

ప్రవాహంలా మద్దతు

  • అన్నివర్గాలు టీఆర్‌ఎస్‌ వెంటే
  • ఏకగ్రీవ తీర్మానాలతో అండ
  • కారుగుర్తుకే ఓటేస్తామని ప్రతిజ్ఞ

అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ వెంటే ఉంటామని కుల, ఉద్యోగ సంఘాలు ఘంటాపథంగా చెప్తున్నాయి. ప్రశాంత హైదరాబాద్‌, ప్రగతి కోసం అన్నివర్గాలు కారు గుర్తుకే ఓటేయాలని పిలుపునిస్తున్నాయి. 

పనిచేసే ప్రభుత్వానికి టీఎన్జీవో బాసట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఎన్జీవో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం గన్‌ఫౌండ్రీలో జరిగిన భాగ్యనగర్‌ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ సమావేశంలో.. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో తీర్మానం చేశారు. టీఎన్జీవో సంఘాల నాయకులు మామిళ్ల రాజేందర్‌, రాయికంటి ప్రతాప్‌, సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి ముజీబ్‌ పాల్గొన్నారు.

ఆలిండియా వెలమ అసోసియేషన్‌ అండ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న గులాబీ పార్టీకి  సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆలిండియా వెలమ అసోసియేషన్‌  ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్సీ కవితను కలిసి తీర్మానపత్రాన్ని అందజేశారు. టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ పుస్కూరి శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు.


సంక్షేమం వెంటే సంచార జాతులు

ఖైరతాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో సంచార జాతులన్నీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. సీఎం కేసీఆర్‌ సంచారజాతులకు ఆరాధ్యుడని తెలంగాణ సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ నరహరి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారు. సమావేశంలో సంఘం కన్వీనర్‌ ఎం చంద్రశేఖర్‌, ముఖ్య సలహాదారు వీ యాదగిరిరావు, ఉపాధ్యక్షులు జీ చంద్రశేఖర్‌, ఎస్‌ సత్యనారాయణ, కార్యదర్శి జే శ్రీనివాస్‌, నాయకులు కోదండరామ్‌, జే రామకృష్ణ పాల్గొన్నారు. 

తెలంగాణ అర్చక సమాఖ్య మద్దతు 

కాచిగూడ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 సీట్లకుపై గానే గెలుచుకోవడం ఖాయమని తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ బర్కత్‌పుర అర్చక భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కారు గుర్తుకే  విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఓటు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రగతిశీల ప్రభుత్వానికే విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు జై కొడుతున్నాయి. అందరిలో కాంతులు నింపిన టీఆర్‌ఎస్‌ సర్కారుకు మద్దతిస్తున్నాయి. 

ప్రగతిశీల ప్రభుత్వానికే మద్దతు

ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణబద్ధులై పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు.. ప్రైవేట్‌పరం కాకుండా ముందుండి పోరాడుతానని ప్రకటించడం హర్షణీయం. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం మంచి పరిణామం. కార్మికుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నగరవాసులను కోరుతున్నాం. 

- పీసర రత్నాకర్‌రావు, ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ సెక్రటరీ జనరల్‌

గౌరవం దక్కేలా చేశారు

వినియోగదారులకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించడం, సమస్యలను తీర్చడంతో విద్యుత్‌ ఉద్యోగులంటే నేడు ప్రజల్లో మంచిపేరు, సరైన గౌరవం దక్కుతున్నది. ఆర్టిజన్‌ నుంచి ఇంజినీర్లు, సీఎండీలందరిని సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఇది మాకు దక్కిన అరుదైన గౌరవం. జీహెచ్‌ఎంసీలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. 

- పరికి సదానందం, తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి


logo