హైదరాబాద్, జనవరి 6 (నమస్తేతెలంగాణ): కేసుల పేరిట కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ డ్రామాకు తెరలేపిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఫార్ములా-ఈ కార్ రేస్‌ను రద్దు చేసి రాష్ట్రానికి తీరని నష్టం మిగిల్చిందని ఆరోపించా రు. సోమవారం ఆయన తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్‌ను అణచివేసేందుకే తప్పుడు కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. లాయర్ల సహాయం తీసుకోవద్దంటూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కో టాను ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్, గజ్జెల నగేశ్, కిశోర్‌గౌడ్, కీర్తిలత పాల్గొన్నారు.