హైదరాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ): వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది. ఆయిల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను సమర్పించాలని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించింది.
ఏజెన్సీలు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తదితర కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.