హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ గిరిజనులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ట్వీట్ చేశారు.
‘మావ నాటే మావ రాజ్’ 
మా తండాల్లో మా రాజ్యం! 
దశాబ్దాల పాటు దగాపడ్డ 
ఈ నినాదం 
దశాబ్ద కాలంలోనే 
నిజమైన నిలువెత్తు విధానం!
స్వరాష్ట్ర సాధన కలను 
నెరవేర్చడమే కాదు, 
గిరిజనులు, ఆదివాసీ బిడ్డల 
చిరకాల డిమాండైన 
స్వయంపాలన స్వప్నాన్ని కూడా 
సాకారం చేశారు 
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
విసిరేసినట్టుగా ఉన్న తండాల్లో 
అద్భుత వికాసం నేడు.. 
గాయాలతో గోసపడ్డ గోండుగూడేల్లో 
అచంచల విశ్వాసం నేడు.
పూర్తి ట్వీట్ ntnews.comలో..