Congress Govt | హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. త్వరలో ఇతర మంత్రుల ఆదాయపు పన్నులను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధులు చెల్లించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.