హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) పనుల పురోగతితోపాటు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)-7 స్టేజ్‌లో నిర్మిస్తున్న ప్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ పనులపై భెల్ సీఎండీ సదాశివమూర్తి, పీఎస్ఎస్ఆర్ ఈడీ తజిందర్గుప్తాతో కలిసి ఆయన శుక్రవారం విద్యుత్తుసౌధలో సమీక్షించారు.
టీజీ జెన్కో పనులకు సరిపడా కార్మికులను నియమించుకోవాలని సూచించారు. అక్టోబర్ నాటికి యాద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) స్టేజ్-1లోని రెండు యూనిట్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి స్టేజ్-2లోని మూడు యూనిట్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో టీజీ జెన్కో డైరెక్టర్లు సచిదానందం, అజయ్, లక్షయ్య పాల్గొన్నారు.