రంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను ఎదురొనే ధైర్యం లేకే కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నాయకులపై ఉసిగొల్పుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో నాయకుల గొంతు నొక్కే ప్రయత్నానికి మోదీ సర్కారు పాల్పడటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమైన నేపథ్యంలో, ఆయనను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను కేంద్రం టార్గెట్ చేసి పిరికి చర్యలకు దిగిందని పేర్కొన్నా రు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీ జేపీ పగటి కలలు కంటున్నదని ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు.