Paul Stirling : టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన ఐర్లాండ్ (Ireland)కు మరో షాకింగ్ న్యూస్. కొన్నాళ్లుగా జట్టును నడిపిస్తున్నపాల్ స్టిర్లింగ్ (Paul Stirling) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఒకేఒక మ్యాచ్ ఆడి.. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన అతడు హఠాత్తుగా కెప్టెన్సీ వదులుకున్నాడు. మోకాలి గాయంతో బాధ పడుతున్న స్టిర్లింగ్ గురువారం నుంచి తాను టీ20 జట్టుకు కెప్టెన్‌గా వైదొలుగుతున్నాని ప్రకటించాడు.
అనామక జట్టైన ఐర్లాండ్ రెండుసార్లు పొట్టి ప్రపంచకప్ ఆడడంలో కీలకమైన పాల్ స్టిర్లింగ్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. మూడేళ్లుగా జట్టును నడిపించిన ఈ విధ్వంసక హిట్టర్.. అనూహ్యంగా నేను ఇక సారథిగా కొనసాగను అని బాం బ్ పేల్చాడు. ‘పొట్టి ఫార్మాట్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ గౌరవం లభించినందుకు చాలా గర్వంగా ఉంది.
Paul Stirling steps down as Ireland’s T20I captain but will continue as a player.
He will still lead Ireland in ODIs ahead of the 2027 ODI World Cup.
📷 Cricket Ireland pic.twitter.com/ud5whIsSIc
— CricketGully (@thecricketgully) March 19, 2026
దేశపు జట్టుకు సారథ్యం వహించడం అనేది పెద్ద బాధ్యత. నాపై ఉంచిన నమ్మకానికి, నాయకుడిగా కొనసాగినన్ని రోజులు నాకు లభించిన మద్దుతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని తన వీడ్కోలు సందేశంలో వెల్లడించిన స్టిర్లింగ్ వన్డే సారథిగా కొనసాగుతానని చెప్పాడు. ‘పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా తప్పుకుంటున్న నేను వన్డేల్లో కొనసాగుతాను. నాలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా నాలోని అత్యుత్తమ ఆటను కనబరిచేందుకు వీలుపడనుంది’ అని స్టిర్లింగ్ తెలిపాడు.
Ireland begin search for a new T20I skipper as preparations begin for #T20WorldCup 2028 👀
More 👇https://t.co/QGVeKnTDYH
— ICC (@ICC) March 19, 2026
ఐర్లాండ్ టీ20 కెప్టెన్‌గా స్టిర్లింగ్‌కు ఘనమైన రికార్డుంది. అతడి సారథ్యంలో 48 మ్యాచుల్లో ఆ జట్టు 20 విజయాలు నమోదు చేసింది. 26 మ్యాచుల్లో ఓడగా.. రెండింటా ఫలితం తేలలేదు. ఆండీ బాల్బిర్నీ నుంచి వన్డే పగ్గాలు స్వీకరించిన స్టిర్లింగ్‌ను ఐర్లాండ్ క్రికెట్ 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించింది. ఫ్రాంచైజ్ క్రికెట్‌తో కలిపి పొట్టి క్రికెట్లో అత్యధిక మ్యాచ్(163)లు ఆడిన క్రికెటర్‌గా స్టిర్లింగ్ రికార్డు నెలకొల్పాడు.