Realme P4 Lite 5G | రియల్‌మి నుంచి పీ4 లైట్ 5జీ ఫోన్ రిలీజ్.. ధర బడ్జెట్లోనే.. ఫీచర్స్, ధర వివరాలివి
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది.
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. రియల్‌మి పీ4 లైట్ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను గురువారం విడుదల చేసింది.
7,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. అలాగే, ఇప్పటికే పీ4 సిరీస్‌లో భాగంగా పీ4, పీ4 ఎక్స్, పీ4 ప్రో5జీ ఫోన్లు రాగా.. ఇదే సిరీస్‌లో ఇప్పుడు తక్కువ ధరలో పీ4 లైట్‌ను తీసుకొచ్చింది. ఇది మొజాయిక్ బ్లూ, మొజాయిక్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ నెల 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో, రియల్‌మి సైట్లో సేల్కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లోని ప్రధాన ఫీచర్లివి.
6.8 అంగుళాల హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, 144హెర్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఐపీ64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ రియల్‌మి యూఐ 7.0, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ సపోర్టు, ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్, 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టు, 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 212 గ్రాముల బరువు వంటి ఫీచర్లున్నాయి. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తారు. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.12,999 / రూ.13,999 /రూ.15,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

