హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లు ఏర్పాటుచేశారు. 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
సిరిసిల్ల రూరల్, మార్చి 21: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత కట్ట రవి కుమార్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మండపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం) లో టెన్త్ విద్యార్థులకు బాసటగా నిలిచారు. కేసీఆర్ నగర్‌కు సరైన బస్సులు లేకపోవడంతో, టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. వారి కోసం పరీక్షలు పూర్తయ్యే వరకు ఉచితంగా ఆటో ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కట్ట రవికుమార్‌కు టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పన్నులను గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా అందించిన విషయం తెలిసిందే. కేటీఆర్ స్ఫూర్తితో విద్యార్థులకు ఉచిత ఆటో ఏర్పాటు చేసినట్లు కట్ట రవి తెలిపారు.