హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): టీటీడీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి.. గరుడవాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. ఈ సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులరద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించనున్నారు. భక్తుల కోసం 400కు పైగా బస్సులు ఏర్పాటుచేశారు. గరుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు రానున్నట్టు ఈవో అంచనా వేశారు.