Srisailam | శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తగు ప్రణాళికలు చేపట్టనున్నట్లు ఈవో చంద్ర శేఖర్ ఆజాద్ అన్నారు. ప్రధానంగా మహోత్సవాలు, పర్వదినాల్లో లక్షలాదిగా తరలి వచ్చే యాత్రికులకు అవసరమగు వాహన పార్కింగ్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పార్కింగ్ ప్రాంతాల నుండి గణేష్ సదన్ మీదుగా అన్నదాన భవనం, డొనేషన్ కౌంటర్, క్యూ కాంప్లెక్స్, నంది సర్కిల్ వరకు ప్రతి అర గంటకు ఒక బస్సు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా తిప్పేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలతోపాటు సంక్రాంతి, శ్రావణమాసం, వినాయకచవితి, కార్తీకమాసం వంటి పర్వదినాల్లో యాత్రికులకు ట్రాఫిక్ సమస్యల నుండి అధిగమింపచేసేందుకు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు ఈవో తెలిపారు.
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్దరామ శివాచార్య మహాస్వామి దర్మించుకున్నారు. కార్తీకమాసం సందర్బంగా గురువారం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ సాంప్రదాయంగా అర్చక వేదపండితులతో కలిసి బిల్వమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Congress Party | రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. వలస నేతలకు పదవులు ఇవ్వడంపై ఆగ్రహం
Junior Lecturers | జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితా విడుదల