ఉత్కంఠపోరులో క్యాపిటల్స్ కమాల్.. హైదరాబాద్‌కు తప్పని ఓటమి
చప్పగా సాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ జోష్ నింపింది. బౌలర్ల సమిష్టి కృషికి విలియమ్సన్ ఒంటరి పోరాటం తోడవడంతో మొదట ఇరు జట్ల స్కోర్లు సమం కాగా.. ఈ సీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్ పోరులో ఢిల్లీ పైచేయి సాధించింది. పృథ్వీ షా మెరుపులకు.. అక్షర్ బౌలింగ్ అండగా నిలువడంతో పంత్ సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.
చెన్నై: సీజన్ ఆరం భం నుంచి స్వల్ప స్కోర్లకు పరిమితమైన చెపాక్ పిచ్‌పై ఆఖరి మ్యాచ్ అదిరిపోయింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన సండే డబుల్ హెడర్‌లో ఢిల్లీ విజేతగా నిలిచింది. అక్షర్ వేసిన సూపర్ ఓవర్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ 7 పరుగులే చేయగా.. అనంతరం ఛేదనలో పంత్ ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. రిషబ్ పంత్ (37), స్టీవ్ స్మిత్ (34) రాణించారు. లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. విలియమ్సన్ (66 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకం కొట్టగా.. బెయిర్‌స్టో (18 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.
విలియమ్సన్ పోరాటం..
మందకొడి పిచ్‌పై లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. వార్నర్ (6) నాలుగో ఓవర్లో రనౌటయ్యాడు. అయినా.. బెయిర్‌స్టో ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టొయినిస్ ఓవర్లో 4,6 కొట్టిన బెయిర్‌స్టో.. అక్షర్ ఓవర్లోనూ 4,6 బాదాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ అరుసుకున్న బెయిర్‌స్టో అదే జోరులో మరో షాట్‌కు యత్నించి ధవన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ 56/2తో నిలిచింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ సింగ్ (14 బంతుల్లో 4) తీవ్రంగా నిరాశ పర్చగా.. కేదార్ జాదవ్ (9), అభిషేక్ (5), రషీద్ (0), విజయ్ శంకర్ (8) విఫలమయ్యారు.19వ ఓవర్లో సుచిత్ (6 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రెండు ఫోర్లు బాదడంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 16కు చేరింది. రబడ వేసిన ఆఖరి ఓవర్లో విలియమ్సన్ ఫోర్, సుచిత్ సిక్స్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి.
షా దూకుడు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ తొలి మూడు బంతులను హ్యాట్రిక్ ఫోర్లుగా మలిచిన పృథ్వీ షా.. మరుసటి ఓవర్లో మరో రెండు బౌండ్రీలు అరుసుకున్నాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. కాస్త నిదానంగా ఆడిన ధవన్ (28)ను రషీద్ ఔట్ చేయగా.. పంత్‌తో సమన్వయ లోపం కారణంగా పృథ్వీ రనౌటయ్యాడు. అయినా స్మిత్‌తో కలిసి పంత్ నిలకడ కొనసాగించడంతో ఢిల్లీ మంచి స్కోరు చేయగలిగింది.
స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (రనౌట్) 53, ధవన్ (బి) రషీద్ 28, పంత్ (సి) సుచిత్ (బి) కౌల్ 37, స్మిత్ (నాటౌట్) 34, హెట్‌మైర్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1, స్టొయినిస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 159/4. వికెట్ల పతనం: 1-81, 2-84, 3-142, 4-145, బౌలింగ్: ఖలీల్ 4-0-42-0, అభిషేక్ 1-0-14-0, కౌల్ 4-0-31-2, సుచిత్ 4-0-21-0, శంకర్ 3-0-19-0, రషీద్ 4-0-31-1.
హైదరాబాద్: వార్నర్ (రనౌట్) 6, బెయిర్‌స్టో (సి) ధవన్ (బి) అవేశ్ 38, విలియమ్సన్ , విరాట్ సింగ్ (సి) స్టొయినిస్ (బి) అవేశ్ 4, జాదవ్ (స్టంప్డ్) పంత్ (బి) మిశ్రా 9, అభిషేక్ (ఎల్బీ) అక్షర్ 5, రషీద్ (ఎల్బీ) అక్షర్ 0, శంకర్ (బి) అవేశ్ 8, సుచిత్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 159/7. వికెట్ల పతనం: 1-28, 2-56, 3-84, 4-104, 5-117, 6-117, 7-136, బౌలింగ్: రబడ 3-0-26-0, అశ్విన్ 4-0-27-0, స్టొయినిస్ 1-0-12-0, అక్షర్ 4-0-26-2, అవేశ్ 4-0-34-3, మిశ్రా 4-0-31-1.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ నె,ర పా
చెన్నై 5 4 1 1.61 8
ఢిల్లీ 5 4 1 0.33 8
బెంగళూరు 5 4 1 0.09 8
ముంబై 5 2 3 -0.03 4
పంజాబ్ 5 2 3 -0.42 4
రాజస్థాన్ 5 2 3 -0.68 4
హైదరాబాద్ 5 1 4 -0.18 2
కోల్‌కతా 5 1 4 -0.67 2
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు