Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు ఉండే దేవస్థానం అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదంటూ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. గురువారం ఆలయ పరిపాలనా విభాగాలతోపాటు పలు కీలక ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీంచి పలు సూచనలు చేశారు.
అదే విధంగా భక్తులకు అందించే వైద్యసేవలను తెలుసుకుని దేవస్థానం ఆసుపత్రిని తనిఖీ చేసి మందుల పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్యసేవలతోపాటు ఆధునిక వైద్యపరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా అన్నదానం, టిక్కెట్ కౌంటర్స్, లడ్డూ తయారీ, విక్రయాలు, డొనేషన్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు, అకామిడేషన్, పెట్రొల్ బంక్స్, టీవీ ఛానల్ నిర్వహణలో లొపాలు లేకుండా చిత్తశుద్దితో విధులు నిర్వహించాలని సూచించారు. ఈవో వెంట ఈఈ నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress Party | రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. వలస నేతలకు పదవులు ఇవ్వడంపై ఆగ్రహం
Srisailam | యాత్రికుల సౌకర్యాలకే ప్రాధాన్యత.. క్షేత్ర పరిధిలో భక్తులకు ఉచిత బస్సు : ఈవో ఆజాద్