హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కను నాటిన ఆయన.. భవిష్యత్తు తరాల కోసం ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.