నారాయణపేట, ఫిబ్రవరి 5: సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, ఆయన తీరుతో ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ల క్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లోని రైతులు, పింఛన్ లబ్ధిదారులు ఆలోచనలో పడ్డారని తెలిపారు. రేవంత్ నోటి దూలతో పరిస్థితి మారుతున్నదని చెప్పారు. రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని పేర్కొన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు మానుకొని ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.