Hey Bhagawan Trailer | వైవిధ్యమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్, తాజాగా ‘హే భగవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సీనియర్ నటుడు నరేష్ తన కుటుంబ వ్యాపారాన్ని (Family Business) రహస్యంగా నిర్వహిస్తుంటారు. ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే నిబంధన ఉంటుంది. అయితే తన తండ్రి వ్యాపారాన్ని సుహాస్ టేకోవర్ చేద్దామనుకుంటాడు. ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తర్వాత సుహాస్ మరియు శివానీ నాగారం మరోసారి జోడీ కట్టడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. దర్శకుడు గోపీ అచ్చర ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడమే కాకుండా, క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలిపారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించగా, బన్నీ వాస్ మరియు వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.