మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని గీతం పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కోలేక కాం గ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. వారి అక్రమాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.