మద్దూరు (కొత్తపల్లి), ఏప్రిల్ 14 : సాగునీళ్లు అందక ఎండిపోయిన పంటలకు వెంటనే పరిహారం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోనిబావి గ్రామ శివారులో ఎండిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కరెంట్ సమస్యలు, సాగునీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.