మహబూబ్‌నగర్ : గ్రామంలో ఉన్న ఏ ఒక్క ఇంటిని వదలకుండా కుటుంబ సభ్యుల వివరాలు, కులం, ఉప కులం తప్పకుండా నమోదు చేయాలని మాజీ మంత్రివ శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud )అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా రాంచద్రాపురం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమ రేటర్లతో కలసి సర్వే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నంబర్ లేని ఇండ్లకు, బై నంబర్ వేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు(Local body elections) ఖరారు చేసి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Also Read..
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ వివాహం.. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది..?
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా