హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆగస్టు 7న ఢిల్లీలో ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కండ్లు తెరిచి ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్‌చేశారు. లేకుంటే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు జీ కిరణ్‌కుమార్, కన్వీనర్ జీ మురళీకృష్ణయాదవ్, హెచ్‌సీయూ విద్యార్థి నేతలు ప్రవీణ్, రాకేశ్దత్తా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.