కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
- తడిసిన ధాన్యం కొనాల్సిందే: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హన్వాడ, మే 1 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 15 రోజులైనా కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందేలా ప్రభుత్వం క్పషి చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, యారియా సకాలంలో అందించడం జరిగిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
వడ్లు పండించి గోసపడుతుండ్రు
- ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్ రూరల్, మే 1 : పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గోసపడుతున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

రెండు వారాల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా కాంటా వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రోజుల తరబడి రైతులు పడిగాపులుకాస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాలేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు బిడ్డ అయితే కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందని తక్కళ్లపల్లి భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

