Sri Rama Navami | రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. నేడు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కల్యాణ మహోత్సవం
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు.
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్
ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహూర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నా రు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. కల్యాణ మహోత్సవం జరిగిన మర్నాడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేండ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహాపట్టాభిషేకం జరుగనున్నది. సీతారామ కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ అధికారులు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 6 వేల మంది సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

