హైదరాబాద్: హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ (SRDP) పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఎస్ఆర్డీపీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో నిలిచిపోయాయని.. వెంటనే పనులను చేపట్టాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులను పూర్తిచేయాలని సంకల్పించింది. వాటిలో 36 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసింది. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్డీపీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా పర్యవేక్షణ కరువైంది. సకాలంలో వాటికోసం చెల్లింపులు చేయడం లేదు. ఆ పనులను కొనసాగించాలని, ఎస్ఆర్డీపీ మూడో దశ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. ఈ జాబితాలో మూసీతో పాటు ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉన్నాయి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
SRDP (Strategic Road Development Program) was a Flagship initiative for developing Hyderabad infrastructure under which KCR Govt had initiated 42 new projects & also completed 36 successfully
The remaining projects were also to be completed in 2024
After the Congress Govt took… pic.twitter.com/fisogejHoZ
— KTR (@KTRBRS) August 27, 2024