శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:38:59

పచ్చని అందాలకు ప్రతిరూపం!

పచ్చని అందాలకు ప్రతిరూపం!

  • గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంపై ప్రత్యేక పాట
  • ఆవిష్కరించిన మంత్రి అల్లోల, వనజీవి రామయ్య

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ: ‘ఊరుకు చిగురుల కళనివ్వాలని.. బీడుకు చినుకుల వరమివ్వాలని.. పచ్చని ఊహకు ప్రతిరూపం ఈ చాలెంజ్‌' అంటూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పాట వచ్చేసింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంపై ప్రత్యేకంగా పాటను రూపొందించారు. దీన్ని  పద్మశ్రీ వనజీవి రామయ్యతో కలిసి అటవీ, పర్యావరణశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం అరణ్యభవన్‌లో ఆవిష్కరించారు. చెట్ల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టిన తనకు రాష్ట్ర ప్రభుత్వం వాహనం ఇచ్చి నెలకు రూ.30 వేలు గౌరవ వేతనంగా ఇస్తున్నదని పద్మశ్రీ వనజీవి రామయ్య తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్ట్రీ) ఆర్‌ఎం డోబ్రియల్‌, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, దర్శకుడు పూర్ణచందర్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, ప్రతినిధి కిశోర్‌గౌడ్‌, కొరియోగ్రాఫర్‌ శిరీష్‌, ఎడిటర్‌ వంశీ, సంగీత దర్శకుడు బాజీ పాల్గొన్నారు. గేయాన్ని దేశపతి శ్రీనివాస్‌ రాయగా, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ నటించి, ఆలపించారు. పూర్ణచందర్‌ దర్శకత్వం, శిరీష్‌ కొరియోగ్రఫీ, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌  కో-ఫౌండర్‌ రాఘవ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. పాట రూపకర్తలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. logo