జిల్లా అంతటా వర్షం
నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగింది.
- ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు
- మండు వేసవిలో ప్రజలకు ఊరట
ఖమ్మం వ్యవసాయం, మే 5 : నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగింది. ఆదివారం ఒక్కసారిగా మేఘాలు అలుముకోవడం ఆ వెనువెంటనే బలమైన గాలులు వీచడం కొద్దిసేపటి తరువాత భారీ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు ఖమ్మం నగరంతోపాటు ఆయా మండలాల్లో కురిశాయి. దీంతో ప్రజలు చల్లటిగాలులకు సేదదీరారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవైపు ఉరుములు, మరోవైపు మెరుపులు తోడు కావడంతో నగరవాసులు కాసింత ఇబ్బందులు పడ్డారు. అయితే కరెంట్ కటింగ్‌తో చిన్నపిల్లలు, వృద్ధులు ఇక్కట్లకు లోనయ్యారు. నగరంలో పాదాచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడ హోర్డింగ్‌లు కింద పడడంతో భయందోళనకు లోనయ్యారు. ఏదేమైనా మండు వేసవిలో అలా వచ్చి ఇలా వెళ్లిన వర్షంతో కాసింత ఉపశమనం పొందారు.
ఇల్లెందు/టేకులపల్లి, మే 5: ఇల్లెందు మండలం మామిడిగుండాలలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మామిడి కాయలు రాలాయి. గట్ల లక్ష్మి, బొమ్మెర గురవయ్యకు చెందిన రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక, సంపత్‌నగర్, బోడు, గంగారం తదితర గ్రామాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన కాయలు రాలిపడ్డాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

