రంగల్ చౌరస్తా/ములుగు/మహబూబాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సుమారు 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానలకు పోటెత్తుతున్నారు. వైరల్, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణ మార్పులతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానకు వస్తున్నారు. దీంతో దవాఖానలోని వార్డులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం దవాఖానలో 56 మంది డెంగీ లక్షణాలతో, మరో 52 మంది వైరల్ ఫీవర్ (విషజ్వరం)తో, ఇద్దరు మలేరియాతో చికిత్స పొందుతున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. గతంలో విషజ్వరాలు ప్రబలడంతో బాధితులకు మెరుగైన చికిత్సను అందించడానికి కార్డియాలజీ విభాగానికి ఆనుకొని ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రత్యేక వార్డు ఏర్పాటుతో రోగులకు సైతం మెరుగైన సేవలు అందాయి. ప్రస్తుతం ఎంజీఎంలో వందకు పైగా కేసులు నమోదవుతున్నా ప్రత్యేక వార్డుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ములుగు జిల్లాలో ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానతోపాటు ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) సామాజిక వైద్యశాలల్లో బెడ్స్ నిండిపోయాయి. ములుగు దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసీయూలో 10 బెడ్లు ఉండగా, రోజూ రోగులతో నిండిపోతున్నది. దీంతో ఐసీయూ బెడ్ల కోసం రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. వైద్యులు రాసిన అన్ని మందులు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో లేక ఉన్న వాటితోనే సరిపెడుతున్నారు. మరికొందరికి బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలలో మందుల కొరత తీవ్రంగా ఉంది. చిన్న పిల్లలకు ఇ చ్చే వ్యాక్సిన్లు కూడా తగినంతగా అం దుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాథమిక కేంద్రాలు, పల్లె దవాఖానల్లో సైతం సరిపడా మందులు లేవు. దీంతో ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు. డాక్టర్ ఫీజుతోపాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, డాక్టర్లు రాసే మందులకు వేలాదిగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కుటుంబంలో కుటుం బ సభ్యులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతున్నాయి.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల వద్ద చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. శనివారం ఉపాలయం వద్ద చిరుత రాకను గమనించిన సెక్యూరిటీ గార్డులు కేకలు వేయడంతో అకడి నుంచి సమీప అటవీప్రాంతంలోకి పారిపోయింది. ఇటీవల చిరుత ఆరుసార్లు ఆ లయ సమీపంలోకి రావడం పట్ల భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18న పాతాళగంగ పాత మెట్ల వైపు చిరుత సంచారాన్ని గమనించిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అం దించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత సంచరించగా అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో పారిపోయింది. చిరుత నివాసా ల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.