హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన విషయంలో కార్మికుల ప్రాణాలతో రాష్ట్రసర్కారు చెలగాటమాడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌నేత నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ మీడియా చానల్లో ఆయన మాట్లాడారు. టన్నెల్లో పెచ్చులూడుతున్నాయని కార్మికులు చెప్పినా వినకుండా, పనికి పురమాయించినట్టు తెలిసిందన్నారు.
ప్రమాదానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని మండిపడ్డారు. కాంగ్రెస్‌పాలనలో రాష్ర్టానికి పూర్తి అన్యాయం జరుగుతున్నదని, రైతాంగానికి భరోసా లేకుండా పోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సమాజానికి భరోసా దక్కిందని చెప్పారు.