‘సర్’ పర్యవేక్షణకు కమిటీ
‘సర్' ప్రక్రియపై బీఆర్ఎస్ తరఫున పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించినట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రకటించారు.
- బీఎల్వోలతో సమన్వయం
- వారిలో సందేహాల నివృత్తి
- ఎన్నికల సంఘంతో సమన్వయం
- సర్’ ప్రక్రియలో కీలకపాత్ర
- ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియపై బీఆర్ఎస్ తరఫున పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించినట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, వై సతీశ్‌రెడ్డి, నాయకులు ముజీబుద్దీన్, సుమిత్రా ఆనంద్, అభిలాష్ రంగినేని ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరఫున బీఎల్ఏలను సమన్వయం చేసుకోవడం, వారికి వచ్చే సందేహాలను నివృత్తిచేయడం, పార్టీ కేంద్ర కార్యాలయానికి క్షేత్రస్థాయి పరిస్థితులను సమన్వయం చేయడం తదితర బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సంఘంతో ఎప్పటికప్పుడూ సమన్వయం చేస్తూ పార్టీ తరఫున ‘సర్’ నిర్వహణ ప్రక్రియలో ఈ కమిటీ కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

