Speaker Pocharam | ప్రభుత్వ విజయంలో ఉద్యోగుల పాత్ర కీలకం : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Speaker Pocharam | తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు.
బాన్సువాడ, సెప్టెంబర్ 13 : తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం భవనాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం భవన పరిసరాల్లో టీఎన్జీవోస్ సంఘం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మించిన నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంతోనే కేంద్రం భయపడి రాష్ర్టాన్ని ప్రకటించిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ గొప్పా.. లేక స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్ వారు గొప్పా అని ప్రశ్నించారు. అదే విధంగా కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఈ రోజు రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయంటే కారణం ఉద్యోగుల సహకారమే అని తెలిపారు.
ప్రభుత్వం సాధించే విజయాల్లో ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. ఉద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వానికి అండగా నిలవాలని, ప్రభుత్వ రుణం తీర్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

