Speaker pocharam | చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి : స్పీకర్ పోచారం
Speaker pocharam | కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు
కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడ లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా, మతిభ్రమించి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. వ్యవసాయం, రైతుల గురించి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని పోచారం తెలిపారు. సాగునీటి రంగంపై గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ లో బోర్లు పెరిగాయన్నారు. రైతుల పొట్ట కొట్టే విదంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు.రైతులను తప్పుదోవ పట్టిస్టూ సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న పనులు అర్ధం పర్ధం లేనివని, హైదరాబాద్ చుట్టూ పక్కల రైతులను భయపెట్టి భూ కబ్జాలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్.వ్యవసాయాన్ని దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.పీసీసీ పదవిని రేవంత్ కు ఇప్పించిందే చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏజెంట్ రేవంత్.
చంద్రబాబు రేవంత్ ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి ఖావడం ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నాయని పోచారం తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాల ఆటలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఎజాజ్, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రామిరెడ్డి, బుల్లెట్ రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

