హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ టీఎన్జీవో నేతలకు హామీ ఇచ్చారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ శనివారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిశారు.
పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.