అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రుతుపవనాలు ( Southwest monsoon ) తాకాయి. రాయలసీమ( Rayalaseema ) జిల్లాలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నాలుగురోజుల్లో రాష్ట్రంలోని సగానికి పైగా భూభాగానికి తాకే అవకాశముందని స్పష్టం చేసింది. దీని కారణంగా ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని అధికారులు వివరించారు.
రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ ( Telangana ) కు సైతం విస్తరించే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చని తెలిపింది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది.